ఆరోగ్య శ్రీ పై కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్..

Update: 2019-06-03 07:29 GMT

వైద్య, ఆరోగ్యశాఖపై ముఖ్యమంత్రి జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ పేరును 'డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ' గా మార్చాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు. అప్పట్లో రాజశేఖరరెడ్డి హయంలో రాజీవ్ ఆరోగ్య శ్రీ పేరుతో ప్రజలకు వైద్య సేవలు అందేవి. గత 2014లో ఏపీలో తెలుగుదేశం పార్టీ అధికారపగ్గాలు చేపట్టడంతో ఈ పేరు కాస్తా ఎన్టీఆర్ వైద్య సేవగా మారింది. ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించి అధికార పగ్గాలు చేపట్టింది వైసీపీ. దీంతో ఎన్టీఆర్ వైద్య సేవ పేరును 'డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ' గా మార్చాలని అధికారులను జగన్ ఆదేశించారు. 

వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్.వి.సుబ్రహ్మణ్యం, ప్రభుత్వ సలహాదారు అజయ్ కల్లాం, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పి.వి.రమేష్, వైద్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య, ముఖ్యమంత్రి కార్యాలయ ముఖ్యకార్యదర్శి ఆరోఖ్యరాజ్, అదనపు కార్యదర్శి కె.ధనంజయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా ప్రభుత్వాస్పత్రుల్లో సౌకర్యాలు, మౌలిక వసతులపై చర్చ జరుపుతున్నారు. అలాగే వైద్య రంగంలో అనుసరిస్తున్న సంస్కరణలపై కూడా చర్చ జరిగింది.


Similar News