జగన్‌ నిర్వాకంతో ఐఏఎస్‌లు జైలుకెళ్లారు: చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయానికి కేంద్రమే బాధ్యత వహించాలని చంద్రబాబు అన్నారు. ఇంకా రూ.85వేల కోట్లు ఏపీకి ఇవ్వాలని నిపుణుల కమిటీ చెప్పిందని ఆయన గుర్తుచేశారు.

Update: 2019-01-08 14:52 GMT

ఆంధ్రప్రదేశ్‌కు జరిగిన అన్యాయానికి కేంద్రమే బాధ్యత వహించాలని చంద్రబాబు అన్నారు. ఇంకా రూ.85వేల కోట్లు ఏపీకి ఇవ్వాలని నిపుణుల కమిటీ చెప్పిందని ఆయన గుర్తుచేశారు. రూ.6లక్షల కోట్ల అవినీతి జరిగిందనిజగన్‌ అంటున్నారని, రాష్ట్ర బడ్జెటే అంత లేదన్నారు. తమ ప్రభుత్వం పారదర్శకంగా పనులు చేసిందని చెప్పారు.

రూ.43వేల కోట్ల అవినీతికి పాల్పడ్డారని జగన్‌పై సీబీఐ ఛార్జి షీట్‌ వేసిందని ఆయన విమర్శించారు. తమ ప్రభుత్వ హయాంలో అవినీతిని సాంకేతికత ద్వారా తగ్గించామని, అవినీతి రహిత సమాజం రావాలనేది తన ఆలోచనంటూ చెప్పారు. జగన్‌ నిర్వాకం వల్ల పలువురు పారిశ్రామికవేత్తలు, ఐఏఎస్‌లు జైలుకు వెళ్లారని మండిపడ్డారు. పూర్తిగా బురదలో కూరుకున్న జగన్‌ తనపై బురద జల్లుతున్నారని దుయ్యబట్టారు. మోదీ అవినీతి చేస్తే మాట్లాడరని, రాష్ట్రంలోని ప్రాజెక్టులకు మాత్రం అడ్డుపడతారని చంద్రబాబు విమర్శించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణపనులు పాత ధరలకే చేయిస్తుంటే అవినీతి జరిగిందంటున్నారని.. తాను అవినీతిపరుల పట్ల కఠినంగా ఉంటానని, వదిలిపెట్టబోననని సీఎం చెప్పారు. మోదీ, కేసీఆర్‌, జగన్‌ ఆడుతున్న నాటకాలు ఇకపై చెల్లవన్నారు. మోదీకి అధికారం ఇస్తే దేశాన్ని భ్రష్టుపట్టించారని ధ్వజమెత్తారు. అభివృద్ధిపై ఆలోచించి ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. ఆదాయం లేకపోయినా అభివృద్ధిలో ముందుకుపోయామని, దగాకోరు నాయకులకు రాబోయే రోజుల్లో బుద్ధి చెప్పాలని ప్రజలకు పిలుపునిచ్చారు.

Similar News