ఏపీ బీజేపీ మేనిఫెస్టో విడుదల..

Update: 2019-03-26 11:24 GMT

ఏపీలో బీజేపీ మేనిఫెస్టో విడుదలైంది. విజయవాడలో ఇవాళ కేంద్ర మంత్రి పియూష్ గోయల్ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా సామాజిక న్యాయం, ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు పునరుద్ధరణ, వ్యవసాయానికి ప్రాధాన్యత కల్పించింది బీజేపీ. ఏపీలో ప్రజాకర్షక పథకాలతో బీజేపీ మేనిఫెస్టోను రూపొందించింది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ విజయవాడలో మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇందులో ప్రధానంగా సామాజిక న్యాయం, ప్రాంతీయ అభివృద్ధి మండళ్లు పునరుద్ధరణ, వ్యవసాయానికి ప్రాధాన్యత కల్పించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడంతోపాటు రాష్ట్రంలోని యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడం లాంటి అంశాలు బీజేపీ మేనిఫెస్టోలో ఎన్నో ఉన్నాయి.

అయితే, కేంద్ర ప్రభుత్వ పథకాలకు రాష్ట్రంలో స్టిక్కర్లు వేసి తమ పథకాలుగా చెప్పుకొంటున్నారని పీయూష్ గోయల్ ఆరోపించారు. ఈ ఐదేళ్లలో చంద్రబాబు ప్రజలకు ఏం చేశారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. మరోవైపు రాష్ట్రంలో అవినీతిని అంతమొందించేందుకు బీజేపీ కృషి చేస్తుందన్నారు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ. ప్రచారంలో తమకు మంచి ఆదరణ లభిస్తోందని, మళ్లీ మోడీని ప్రధాని చేయాలని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పాటు దిశగానే సీట్లు గెలుస్తామన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే, ఈ మేనిఫెస్టోలో రాష్ట్ర విభజన హామీలు గానీ, ప్రత్యేక హోదా అంశాన్ని గానీ చేర్చలేదు. ఇప్పటికే బీజేపీ మోసం చేసిందని పార్టీలు, ప్రజలు మండిపడుతున్న సమయంలో విడుదలైన బీజేపీ మేనిఫెస్టో మరోసారి విమర్శలకు దారితీసింది.

Similar News