రైతుబంధును మెచ్చుకున్న హజారే..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకంపై సామాజికి ఉద్యమకారుడు అన్నాహజారే ప్రశంసలు కురిపించాడు. తెలంగాణలో ప్రభుత్వం మంచి పథకాలు తీసుకువస్తోందన్నారు అన్నా హజారే.

Update: 2019-01-19 13:09 GMT

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకంపై సామాజికి ఉద్యమకారుడు అన్నాహజారే ప్రశంసలు కురిపించాడు. తెలంగాణలో ప్రభుత్వం మంచి పథకాలు తీసుకువస్తోందన్నారు అన్నా హజారే. రైతు బంధు పథకం రైతులకు ఎంతో మంచి చేసే విధంగా ఉందన్నారు. రైతులకు ఇలాంటి పథకం చాలా అవసరమని, ఈ పథకం గురించి కేంద్రప్రభుత్వంతో పాటు ప్రతి రాష్ట్రం కూడా ఆలోచన చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న రైతుబంధు పథకం దేశానికి చాలా అత్యవసరమని తెలిపారు. అన్ని రాష్ట్రాలలోనూ తప్పకుండా రైతుబంధు అమలు చేయాలన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ యువజన నాయకత్వ సదస్సులో ఆయన పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ జాగృతి యువత కోసం నిర్వహిస్తున్న సమావేశాలు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయని తెలిపారు. లోక్ పాల్ చట్టాన్ని మోడీ ప్రభుత్వం అమలు చేయడం లేదంటూ ప్రశ్నించారు.

Similar News