భారత్‌తో యుద్ధం కోరుకోవడం లేదు: పాక్‌

Update: 2019-02-27 14:55 GMT

వార్ సైరన్ మోగింది. భారత పాకిస్థాన్ మధ్య యుద్ధమేఘాలు ఆవరించి నిన్నటి వైమానికి దాడులతో తీవ్ర అసహనంతో ఉన్న పాకిస్తాన్ దుస్సాహసం చేసింది. 3 యుద్ధ విమానాలను మన మన గగన తలంలోకి పంపింది. అంతేకాదు మన భూభాగంలో బాంబులు జారవిడిచిన సంగతి తెలిసిందే కాగా ఈ నేపథ్యంలో భారత్‌తో యుద్దం కోరుకోవడం లేదంటూ పాక్ సైకికాధికారి ఆసిఫ్ గఫూర్ అన్నారు. అసలు సమస్యలపై ఇరు దేశాలు కలిసి చర్చించుకుందామని ఆయన పిలుపునిచ్చారు. అసలు పాకిస్థాన్ బాధ్యతాయుత దేశమేనని ఉద్రికత్త పరిస్థితులు నెలకొల్పడం తమ ఉద్దేశమే కాదన్నారు. ఆత్మ రక్షణలో భాగంగానే పాకిస్థాన్ యుద్ధ విమానాలు నియంత్రణ రేఖ వెంట దాడులు చేశాయని ఆయన చెప్పుకొచ్చారు. పాకిస్థాన్ ఎప్పుడూ శాంతినే ఆశిస్తుందని, యుద్ధం కోరుకోదని పొంతనలేని వ్యాఖ్యలు చేశారు. 

Similar News