సీఎ‌ం జగన్ ముఖ్య సలహాదారుగా అజేయ కల్లం

Update: 2019-06-05 00:41 GMT

ఐఏఎస్‌ల బదిలీలు, నియామకాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తనదైన ముద్ర చూపింది. జగన్ ముఖ్య సలహాదారునిగా మాజీ సీఎస్ అజేయకల్లంను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అజేయకల్లంకు కేబినేట్ హోదా కల్పించారు. ప్రభుత్వంలోని అన్ని విభాగాలకు ఆయన సూచనలు, సలహాలు ఇస్తారు. మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో ఉంటారు. అజేయకల్లం పేషికి పది మంది సిబ్బందిని కేటాయించారు. ఆయన జీతం నెలకు 2.5 లక్షలు. ముఖ్యమంత్రి కార్యాలయం కార్యదర్శులతో పాటు ప్రభుత్వ సలహాదారులందరికీ అజేయ కల్లం నాయకత్వం వహించనున్నారు. పర్యటనలకు వెళ్లినప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా రిటైర్‌ కాకముందు ఉన్న టీఏ, డీఏలు వర్తిస్తాయి. ప్రభుత్వ వాహనంతోపాటు నివాస వసతి సౌకర్యం కల్పిస్తారు. లేదంటే ప్రభుత్వం అద్దె చెల్లిస్తుంది. 

Tags:    

Similar News