నటుడు నాజర్ పై అయన సోదరులు ఆరోపణలు ..

Update: 2019-05-19 04:51 GMT

నటుడు నాజర్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. దక్షిణాదిలో పలు చిత్రాల్లో వివిధ రకాల పాత్రల్లో నటించి పేరు తెచ్చుకున్న నటుడు. ఈయన నిర్మాతగా, దర్శకుడిగా కూడా చిత్రాలు చేశారు. అయితే వృద్ధాప్యంలో, అనారోగ్యంతో బాధపడుతున్న అయన తల్లిదండ్రులను నటుడు నాజర్‌ పట్టించుకోవడం లేదని, వారికి ఆర్థిక సాయం చేయకున్నా కనీసం పరామర్శించడానికి కూడా రావడం లేదని ఆయన సోదరులు ఆరోపించారు. ఈ విషయంలో నాజర్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని శుక్రవారం చెన్నైలో మీడియా సమావేశంలో వెల్లడించారు.

వివాహనంతరం తమ కుటుంబానికి దూరంగా వెళ్లిపోయాడని చెప్పారు. తమ తల్లిదండ్రులు వృద్ధాప్యంతో, అనారోగ్యానికి గురయ్యారన్నారు. కాగా, నటుడిగా బాగా సంపాదించిన నాజర్‌ తన భార్య పిల్లలకే ఖర్చు చేసుకుంటున్నాడు గానీ, తమకెలాంటి సాయం అదించడం లేదన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఆదుకోకపోగా, కనీసం వారిని చూడడానికి కూడా రావడంలేదని ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ విషయంలో నాజర్‌ స్పందించకపోతే అతనిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 

Similar News