సంచలన తీర్పు; 180 ఏళ్ల జైలు శిక్ష

Update: 2019-05-04 12:56 GMT

అమెరికాలోని లోవాకు చెందిన ఓ పేరుగాంచిన బాస్కెట్‌బాల్ క్లబ్బుకు పెద్ద కోచ్‌గా పనిచేశాడతను. తను కోచ్‌గా వ్యవహరించిన టీమ్‌ను ఏకంగా జాతీయస్థాయి పోటీలకు చేర్చిచిన ఘటత అతడిది. బాస్కెట్ బాల్‌కు సంబంధించి లోవాలో ఉన్న టాప్ 5 కోచ్‌లో ఓడిగా మంచీ పేరు ప్రఖ్యాతలు గాంచినవాడు ఈ కోచ్. తనకంటూ కోచ్‌గా ప్రత్యేక పేరు తెచ్చుకున్నాడు. అయితే ఇదంత ఒక ఎత్తు అయితే ఇప్పడు చెప్పబోయేది మరోక ఎత్తు. అతనికి అబ్బాయిలంటే పిచ్చి, మోజు, వ్యమోహం. ఇతడికి అమ్మాయి పేరిట సోషల్ మీడియాలో ఓ అకౌంట్‌ని తెరిచి అబ్బాయిలతో రోజూ చాట్ చేసేవాడు. వారితో సరదగా మాట్లాడుతూ మాటలతో మాయాచేసేవాడు. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నంటూ వారి దగ్గరి నుండి నగ్న చిత్రాలను సేకరించేవాడు.

తాను కోచ్‌గా ఉన్న బాస్కెట్‌బాల్ టీమ్ మెంబర్స్ హోటళ్లలో నిద్రపోతున్నపుడు వారి ఒంటిపైన ఉన్న బట్టలను తొలగించి వారి పక్కనే పడుకొని సెల్ఫీలు తీసుకొనేవాడు. ఇక కొంత మంది పిల్లల్ని అయితే బెదిరించి, భయబ్రాంతులకు గురిచేసి కోరికలు తీర్చమనేవాడు. కొందరు అబ్బాయిలు నిద్రలేచేసరికి వారి మర్మాంగంతో రోజూ ఆటలాడుతూ ఉండేవాడు. ఇలా 1999 నుంచి 2018 వరకు దాదాపు 20 ఏళ్లపాటు ఎవరికీ తెలియకుండా రహస్య కార్యకలాపాలు సాగించిన 43 ఏళ్ల గ్రెగ్ స్టీఫెన్ చిట్టచివరకు జైలుపాలయ్యాడు. గ్రెగ్ దాచుకున్న ఓ పెన్‌డ్రైవ్‌లో అతను అబ్బాయిలతో ఉన్న ఫోటోలు చూసిన అతని సోదరుడు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే దీనిపై విచారణ చేసిన అధికారులకు షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. గ్రెగ్ ఇప్పటివరకూ దాదాపు 440 మంది అబ్బాయిలను లైంగిక వేధించినట్లు ఆధారాలు ఉన్నాయి. దీంతో కోర్టు అతనికి 180 ఏళ్ల జైలుశిక్ష వేసింది. ఈ కేసులో అతనికి ఇంతకుమించి శిక్ష విధించలేనందుకు చింతిస్తున్నామని కోర్టు వ్యాఖ్యానించింది.

Similar News