చక్కని కాపురంలో చిచ్చు పెట్టిన మటన్ ముక్క ..

Update: 2019-05-30 11:57 GMT

ఇద్దరు ఒకే మతస్థులు.. ప్రేమించి పెళ్లి చేసుకున్నారు ..కాపురం ఓ ఆరు నెలలు చాలా చక్కగా సాగింది.. కానీ వీళ్ళ కాపురంలో ఓ మటన్ ముక్కొచ్చి చిచ్చు పెట్టింది .. వినడానికి విచిత్రంగా ఉన్నా నిజమే మరి .. ఈ సంఘటన హైదరాబాద్ లోనే చోటు చేసుకుంది .. ఇక వివరాల్లోకి వెళ్తే .. అ అబ్బాయి కుటుంబీకులు పూర్తి శాఖాహారులు. తమకు ముక్కవాసన పడదని అ యువకుడు ముందే చెప్పాడు. ఒకవేళ నాన్ వెజ్ తినాలనిపిస్తే బయట తినాలని పెళ్లికి ముందే షరతు విధించాడు. అందుకు అమ్మాయి కూడా అంగీకరించడంతో ఆరు నెలల క్రితం పెళ్లి చేసుకున్నారు.

భర్త షరతును ముందుగా అంగీకరించిన అ భార్య తర్వాత మాట తప్పింది .. ఇంట్లోనే ముక్కకూర వండడం మొదలు పెట్టింది . పోనీ ఇక్కడితే ఆగిందా అంటే అది లేదు . భర్తతో కూడా  తినిపించాలని అనుకుంది . దీనికి భర్త అంగీకరించకపోవడంతో అలిగి పుట్టింటికి వెళ్ళింది. భర్తకి ఎలా అయిన బుద్ది చెప్పాలి అనుకున్నా ఆమె జూబ్లిహిల్స్ పోలిసులుకు తనని తన భర్త వేదిస్తున్నడంటూ కేసు పెట్టింది . తీరా విచారణలో అసలు నిజం తెలుసుకున్నా పోలీసులు అవాక్కయ్యారు .. ఇరు కుటుంబ సభ్యులకి సంబంధించిన పెద్ద మనుషులను నచ్చజెప్పే ప్రయత్నం చేసారు .. కానీ ఇంకా పంచాయితీ తేలలేదు ..  

Similar News