సహస్ర చండీ యాగానికి సర్వం

సీఎం కేసీఆర్ రేపట్నుంచి నిర్వహించనున్న మహా రుద్ర సహిత సహస్ర చండీ యాగానికి సర్వం సిద్ధమైంది. సిద్ధిపేట జిల్లా మర్కూర్ మండలం ఎర్రవల్లి వ్యవపాయ క్షేత్రంలో ఈ యాగానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Update: 2019-01-20 07:37 GMT

సీఎం కేసీఆర్ రేపట్నుంచి నిర్వహించనున్న మహా రుద్ర సహిత సహస్ర చండీ యాగానికి సర్వం సిద్ధమైంది. సిద్ధిపేట జిల్లా మర్కూర్ మండలం ఎర్రవల్లి వ్యవపాయ క్షేత్రంలో ఈ యాగానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపట్నుంచి ఐదురోజుల పాటు చండీ యాగాన్ని నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను శారదాపీఠం వేద బ్రహ్మణులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. మూడు యాగశాలలతో పాటు 27 హోమగుండాలు ఏర్పాటు చేస్తున్నారు. కర్నాటకకు చెందిన శృంగేరి పీఠానికి చెందిన 200 మంది రుత్వికులు, స్థానిక వేద పండితులు ఈ యాగంలో పాల్గొనబోతున్నారు. మూడేళ్ల కిందట కేసీఆర్ తన వ్యవసాయ క్షేత్రంలో అయుత చండీయాగం ఎన్నికల ముందు రాజశ్యామల యాగం నిర్వహించారు. 

Similar News