నీరవ్ మోడీకి యూకే కోర్టులో చుక్కెదురు

Update: 2019-06-12 11:05 GMT

భారత్‌లో కోట్లాది రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాక్ కుంభకోణంతో పాటు మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీకి యూకే హైకోర్టులో చుక్కెదురైంది. ఆయనను బెయిల్ ఇచ్చేందుకు రాయల్ కోర్ట్స్ ఆఫ్ జస్టిస్ నిరాకరించింది. దీంతో ఆయన ప్రస్తుతానికి జైలుకే పరిమిత కావాల్సి ఉంటుంది. నీరవ్ మోడీకి బెయిల్ నిరాకరించడం ఇది నాలుగోసారి. నీరవ్‌పై ఉన్న కేసుల నేపథ్యంలో ఇంగ్లాండ్ వెస్ట్ మినిస్టర్ మెజిస్ట్రేట్ కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరిస్తోంది. గత మార్చి 20న అరెస్టయిన నీరవ్ ప్రస్తుతం లండన్‌లో ఖైదీలతో కిటకిటలాడే హెర్ మెజిస్టీస్ వాండ్స్‌వర్త్ జైలులో ఉన్నారు. ఆర్థిక నేరగాళ్ల అప్పగింత ఒప్పందం ప్రకారం నీరవ్ మోడీని భారత్‌కు అప్పగించేందుకు ఇంగ్లాండ్ నిర్ణయిస్తే ఆయనను ముంబైలోని ఆర్థర్ రోడ్డు జైలులో ఉంచేందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి.

Tags:    

Similar News