ఆయిల్‌ ట్యాంకర్‌ పేలి 62మంది మృతి!

Update: 2019-08-10 12:09 GMT

టాంజానియాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆయిల్ ట్యాంకర్‌ పేలిన ఘటనలో 62 మంది చనిపోయారు. 70 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఆయిల్ ట్యాంకర్‌ బోల్తా పడిన సమయంలో అక్కడకు చేరుకున్న కొందరు స్థానికులు ఆయిల్‌ను తీసుకునేందుకు ప్రయత్నించారు. ఈ సమయంలో ట్యాంకర్‌ ఒక్కసారిగా బ్లాస్ట్ కావడంతో ప్రమాదం సంభవించింది. 62 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో అక్కడున్నవారు మంటల్లో కాలిపోతూ ఆర్తనాదాలు చేశారు. 

Tags:    

Similar News