మహిళా వన్డే క్రికెట్లో మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డు

Update: 2019-02-01 10:24 GMT

మహిళా వన్డే క్రికెట్లో భారత కెప్టెన్ మిథాలీ రాజ్ ప్రపంచ రికార్డుతో తనకు తానే సాటిగా నిలిచింది. హామిల్టన్ సెడ్డాన్ పార్క్ వేదికగా న్యూజిలాండ్ తో ముగిసిన ఆఖరివన్డేలో పాల్గొనడం ద్వారా...మిథాలీ 200 మ్యాచ్‌లు ఆడిన తొలి మహిళా క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది. 1999లో ఐర్లాండ్ ప్రత్యర్థిగా వన్డే అరంగేట్రం మ్యాచ్ ఆడిన మిథాలీ..గత రెండుదశాబ్దాల కాలంలో ఆడిన 199 వన్డేల్లో 179 ఇన్నింగ్స్ ఆడి..6వేల 613 పరుగులతో 51.66 సగటు నమోదు చేసింది. మొత్తం ఏడు సెంచరీలు, 52 హాఫ్ సెంచరీలు సాధించిన మిథాలీ 51సార్లు నాటౌట్, ఆరుసార్లు డకౌట్ రికార్డులను సైతం తన ఖాతాలో వేసుకొంది. 36 ఏళ్ల మిథాలీ...అత్యధికంగా.. 122 మ్యాచ్ ల్లో భారత్ కు నాయకత్వం వహించింది. మహిళా క్రికెట్లో అత్యధిక వన్డేలలో కెప్టెన్ గా వ్యవహరించిన ఏకైక క్రికెటర్ మిథాలీ మాత్రమే. మిథాలీ నాయకత్వంలో భారత్ 75 విజయాలు, 44 పరాజయాల రికార్డు నమోదు చేసింది.

Similar News