ఇటలీలో విరాట్ కొహ్లీ, అనుష్క శర్మల పెళ్లి..?

Update: 2017-12-13 07:12 GMT

విరాట్ కొహ్లీ, అనుష్క శర్మల పెళ్లి వార్తలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. క్రికెట్ నుంచి నాలుగువారాలపాటు బ్రేక్ తీసుకొన్న విరాట్ కొహ్లీ తన ప్రియురాలు అనుష్క శర్మతో కలసి ఇటలీ పర్యటనకు బయలుదేరినట్లు..ముంబైలో వార్తలు జోరందుకొన్నాయి. దీనికితోడు అనుష్క కుటుంబసభ్యులు సైతం యూరోప్ టూర్ కు బయలుదేరటంతో.....ఇటలీ వేదికగా ఈనెల 9,10, 11 తేదీలలో...ఏదో ఒకరోజు వివాహం జరిగే అవకాశం లేకపోలేదని భావిస్తున్నారు. నిశ్చితార్థం లేదా వివాహ కార్యక్రమాలలో ఏదో ఒకటి జరగడం ఖాయమని జాతీయ మీడియా వర్గాలు ఓవైపు కోడై కూస్తుంటే...మరోవైపు...అనుష్క మేనేజర్ మాత్రం...అలాంటి వార్తలు నిజంకాదని పదే పదే చెప్పడం విశేషం...

Similar News