హీరోయిన్‌కి షాక్‌ ఇచ్చిన అమెజాన్‌... హెడ్‌ఫోన్స్ ఆర్డర్ చేస్తే...

Update: 2018-12-14 10:00 GMT

ఆన్‌లైన్‌లో ఎవరైనా మొబైల్ ఫోన్ ఆర్డర్ చేస్తే ఇటుకలు రావడం పార్శిల్‌లో ఆర్డర్ చేసిన వస్తువు కాకుండా మరొకటి ఉండటం లాంటి ఘటనలు చూస్తూనే ఉంటాం. ఎక్కువగా సామాన్యులకే ఇలాంటి చేదు అనుభవాలు ఎదురవుతుంటాయి. తాజాగా ఇలాంటి అనుభవమే ఓ బాలీవుడ్‌ హీరోయిన్‌కు ఎదురైంది. సోనాక్షి సిన్హా అమెజాన్‌లో బోస్‌ కంపెనీ ఇయర్‌ ఫోన్స్‌ బుక్‌ చేశారు. అయితే ఆ ప్యాక్‌ ఇయర్‌ ఫోన్స్‌కు బదులు ఓ ఇనుప ముక్క ఉండటంతో సోనాక్షి షాక్‌కు గురయ్యారు. ఈ విషయంపై అమెజాన్‌ కస్టమర్‌ కేర్‌ను సంప్రదించే ప్రయత్నం చేసిన వారు సరిగ్గా స్పందించకపోవటంతో ఆమె సోషల్‌ మీడియాలో ఈ విషయాన్ని షేర్‌ చేశారు. ‘అమెజాన్‌.. నేను బోస్‌ ఇయర్‌ఫోన్స్‌ ఆర్డర్ చేస్తే ఏమో వచ్చాయో చూడండి. బయటకు బాక్స్‌ మంచి ప్యాక్‌ చేసిన నీట్‌గా సీల్‌వేసి ఉంది. మీ కస్టమర్‌ సర్వీస్‌ కూడా సాయం చేసేందుకు సిద్ధంగా లేదు’ అంటూ ట్వీట్ చేశారు. అయితే జరిగిన తప్పిదానికి క్షమాపణ చెబుతూ అమెజాన్ ట్వీట్ చేసింది. జరిగిన పొరపాటును సరి చేస్తామని సోనాక్షికి హామీ ఇచ్చింది.
 

Similar News