తమిళ సూపర్ స్టార్ రజీనికాంత్ ఇప్పటికే తనదైనశైలీలో రాజకీయాల్లో ముద్రవేసుకోవాడానికి రజీనికాంత్ సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే కమల్ హాసన్, రజినీకాంత్ తమ రాజకీయా వ్యూహాన్ని ఎప్పటికప్పుడు పావులు కదుపుతున్న విషయం తెలిసిందే. కాగా ఇప్పటి ట్రెండ్ ప్రకారం రాజకీయాల పార్టీలకు తప్పనిసరిగా తమకంటూ ఒక ఛానల్ను ఏర్పాటు చేసుకుంటున్న నేపథ్యంలో తాజాగా తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా ఇదే తరహాలో ఒక ఛానల్ను ఏర్పాటుచేయనన్నట్లు ఓ లేఖ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టీవీ ఛానల్ కోసం రజినీ అభిమానుల సంఘం కన్వీనర్ సుధాకర్ ట్రేడ్మార్క్ రిజిస్ట్రీ వెబ్సైట్లో అప్లై చేశారు. రజినీ తన పేరు, ఫొటోను ఉపయోగించుకునేందుకు సమ్మతిని తెలుపుతూ ఓ లేక కూడా ఇచ్చారు. అందులో సూపర్ స్టార్ టీవీకి రజినీకాంత్ క్యారికేచర్స్తో కూడిన లోగో ఇచ్చారు. సూపర్ స్టార్ టీవీ, రజినీ టీవీ, తలైవార్ టీవీ’ పేర్లు పెట్టాలని యోచిస్తున్నారు. గత ఏడాది డిసెంబర్ 31 రజినీ తన పొలిటికల్ ఎంట్రీ గురించి ప్రకటించి దానికి ‘మక్కల్ మంద్రమ్’ అనే పార్టీని రజనీకాంత్ స్థాపించిన విషయం తెలిసిందే.