పార్టీ మారిన నో యూజ్‌... తట్టా బుట్టా సర్దుకోవాల్సిందేనా?

Update: 2018-10-04 09:50 GMT

కర్నూలు ఎంపీ బుట్టా రేణక పార్టీ మారినా ప్రయోజనం మాత్రం కలగడం లేదట. నియోజకవర్గంలో చక్రం తిప్పేందుకు బుట్టా తహతహలాడుతుంటే అధికారులు మాత్రం అడుగడుగునా సహాయ నిరాకరణ చేస్తున్నారట. కోరి మరీ అధికార పార్టీలోకి వస్తే తనకు తెలియకుండానే అన్ని పనులు జరుగుతున్నాయంటూ బుట్టా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ వర్సెస్ కమిషన్‎ర్‌గా సాగుతున్న ఈ పంచాయతి తాజాగా అమరావతి చేరుకుంది. ఎంపీ బుట్టా రేణుక కర్నూలు నగరపాలక కమిషనర్ హరినాధ్ రెడ్డి మధ్య రోజుకో వివాదం రేగుతోంది. అభివృద్ధి, సంక్షేమ పనుల్లో తనకు సమాచారం ఇవ్వడం లేదంటూ బుట్టా రేణక గత కొద్ది కాలంగా హరినాథ్‌రెడ్డిపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. బీసీ వర్గానికి చెందిన తనను కావాలనే చిన్నచూపు చూస్తున్నారంటూ ఆరోపించారు. ఈ విషయంలో ఎంపీకి బీసీ సంఘాలు అండగా నిలిచాయి.  

అవినీతి వ్యవహారాలు, లోపాయికారి ఒప్పందాలను ప్రశ్నించినందుకే తనను అవమానిస్తున్నారంటూ బుట్టా రేణుక ఆరోపిస్తున్నారు. ప్రోటోకాల్ పాటించకుండా తనను అవమానిస్తున్నారంటూ మంత్రి నారాయణకు ఫిర్యాదు చేశారు. బుట్టా ఆరోపణలను కమిషనర్‌ హరినాథ్‌రెడ్డి ఖండిస్తున్నారు. ప్రతి విషయంపై సమాచారం అందించడమే కాక వివాదాన్ని ముగించేందుకు తానే స్వయంగా క్షమాపణ చెప్పానంటున్నారు. ఇటు ఎంపి అధికారుల మధ్య రాజుకున్న ప్రోటోకాల్‌ వివాదంపై ప్రజాసంఘాలు స్పందించాయి. ప్రతిసారి అధికారుల పనితీరుకు అడ్డం పడుతున్నారని ఆరోపించాయి. నేతలకు అధికారులకు మధ్య తలెత్తిన వివాదం స్ధానికులకు తలనొప్పిగా మారింది. ప్రజా సమస్యలపై దృష్టి సారించాల్సిన వాళ్లు వివాదాలతో కాలయాపన చేయడం సరికాదంటూ అభిప్రాయపడుతున్నారు. 

Similar News