ఉప్పల్ సీటు కాంగ్రెస్‌కే కేటాయించాలని గాంధీభవన్ ముందు నిరసన

Update: 2018-11-10 11:23 GMT

ఉప్పల్ సీటు కాంగ్రెస్‌కే కేటాయించాలని డిమాండ్ చేస్తూ గాంధీభవన్ ముందు ఆ పార్టీ నేతలు నిరసనకు దిగారు. ఉప్పల్ టికెట్ టీడీపీకి కేటాయించవద్దని ఆందోళన బాటపట్టారు. ఉప్పల్ సీటు కాంగ్రెస్‌కే కేటాయించాలని కాంగ్రెస్ నేత రాగిడి లక్ష్మారెడ్డి తన అనుచరులతో గాంధీభవన్ ముందు నిరసనకు దిగారు. ఈ ఆందోళనలో కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు. ఆందోళన చేస్తున్న కార్యకర్తలను బుజ్జగించడానికి వచ్చిన క్రమశిక్షణ సంఘం చైర్మన్ కోదండరెడ్డి కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. 

కోదండ రెడ్డి మాట్లాడుతూ ఇంకా సీట్లు ఎవ్వరికి కేటాయించలేదుని అప్పుడే కార్యకర్తలు తొందరపడవద్దని కార్యకర్తలకు సూచించారు.అందరం పొత్తుల ధర్మం పాటించాలనిటిక్కెట్లు ప్రకటించిన తరువాత కార్యకర్తలు అభ్యంతరాలు వ్యక్తం చెయ్యవచ్చని రాగిడి లక్ష్మ రెడ్డి తెలిపారు. ఉప్పల్ కాంగ్రెస్ ఇంచార్జ్ సీట్లు ప్రకటించకముందే టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారని అందుకే కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నమని కాంగ్రెస్ తమతో చర్చించకుండ టికెట్లు కేటాయిస్తే పార్టీకే నష్టం జరుగుతుందని హెచ్చరించారు.

Similar News