తెలంగాణ వ్యతిరేకులకు..తెలంగాణ వాదులకు మధ్య యుద్దం: హరీశ్

Update: 2018-12-03 07:39 GMT


పోరాడి సాధించుకున్న తెలంగాణలో తొలిసారి జరుగుతున్న ఎన్నికలు  తెలంగాణ వ్యతిరేకులకు తెలంగాణ వాదులకు మధ్య జరుగుతున్న పోరాటంగా మంత్రి హరీష్‌రావు అభివర్ణించారు. మహాకూటమి ఏర్పాటు వెనక తెలంగాణ మనుగడను ప్రశ్నార్ధకం చేసే కుట్ర దాగుందంటూ ఆయన ఆరోపించారు. తెలంగాణకు అడుగడుగున అడ్డుపడిన చంద్రబాబు రాష్ట్రంలో అడుగు పెట్టేందుకు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారంటూ విమర్శించారు. మహాకూటమిలోని సీపీఐ, కోదండరామ్‌లు డమ్మీలుగా మిగిలారన్న ఆయన ..తెలంగాణ  ఏర్పడిన నాటి నుంచి అభివృద్ధిని అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుది కాదా అంటూ ప్రశ్నించారు. 

Similar News