భగ్గుమన్న బంగారం ధర

Update: 2017-12-13 08:53 GMT

ఉత్తరకొరియా ఎఫెక్ట్ కారణంగా బంగారం ధర భగ్గుమంది. ఈ ఏడాదిలోనే అత్యంత గరిష్ఠానికి చేరింది. ఇవాల్టి ట్రేడింగ్‌లో 200 రూపాయలు పెరగడంతో 10 గ్రాముల స్వచ్ఛమైన పసిడి 30 వేల 600కి చేరింది. దేశీయంగా పసిడి ధర గత రెండు సెషన్లలో...350 రూపాయలు పెరిగింది. అటు వెండి ధర కూడా 200 రూపాయలు  పెరిగి కిలో 41 వేల 700కి చేరింది. ఉత్తరకొరియా హైడ్రోజన్‌ బాంబును పరీక్షించడంతో అంతర్జాతీయంగా రాజ‌కీయ పరిణామాలు వేడెక్కడంతో అది పసిడి ధరపై ప్రభావం చూపింది. దీనికి తోడు స్థానిక ఆభరణాల తయారీదారుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడం కూడా బంగారం ధర పెరుగుదలకు కారణమని బులియన్‌ వర్గాలు తెలిపాయి.

Similar News