కస్టమర్ భోజనాన్ని రుచిచూసిన డెలివరీ బాయ్.. కొరడా ఝుళిపించిన కంపెనీ!

Update: 2018-08-22 08:36 GMT

కస్టమర్లకు ఇవ్వాల్సిన ఆహారాన్ని తానే సగం తినేసి తర్వాత దాన్ని మళ్లీ మామూలుగా ప్యాక్‌ చేసి డెలివరీ ఇవ్వడానికి తీసుకెళ్లిన ఘటన చైనాలో జరిగింది. గువాంగ్‌డాంగ్‌ ప్రావిన్స్‌లోని సిహుయి నగరంలో ఓ డెలివరీ బాయ్‌ చేసిన నిర్వాకం సీసీటీవీలో రికార్డు కాగా ఆ ఫుటేజీ వైరల్‌గా మారింది. డెలివరీ బాయ్‌ లిఫ్ట్‌లో వెళ్తున్నప్పుడు ఈ పని చేశాడు. ఈ వీడియో వైరల్‌ అవ్వడంతో సదరు కంపెనీ అతడిని ఉద్యోగంలో నుంచి తొలగించింది.
 

Full View

Similar News