కూటమి వీడే ప్రసక్తే లేదు: చాడ వెంకట్ రెడ్డి

Update: 2018-11-06 11:53 GMT

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కోరినన్ని సీట్లు ఇవ్వకపోతే ఒంటరిగా పోటీ చేస్తామంటూ అనేకసార్లు కాంగ్రెస్‌కు అల్టిమేటం ఇచ్చిన చాడ ఇప్పుడు కూటమితోనే ముందుకెళ్తామని స్ఫష్టం చేశారు . కేసీఆర్‌‌ను గద్దె దించాలంటే కొంత సర్దుబాటు ధోరణి తప్పదన్నారు. కూటమి ముందు 9 స్థానాలను ఉంచామని కాంగ్రెస్‌ మాత్రం 3 సీట్లు ఇస్తామంటోందని, కానీ తమకు కనీసం 5 స్థానాలను కేటాయించాలని కోరుతున్నట్లు తెలిపారు. సంఖ్యతోపాటు తాము కోరుతున్న స్థానాలనే ఇవ్వాలని చాడ డిమాండ్ చేస్తున్నారు. సీట్ల సర్దుబాటుపై తమ జాతీయ నాయకత్వం కాంగ్రెస్‌ అధిష్టానంతో మాట్లాడుతోందంటున్న చాడ వెంకట్‌రెడ్డి వెల్లడించారు.
 

Similar News