కోర్టు హాలులో పాము కాటు - న్యాయమూర్తి తప్పిన ప్రమాదం

Update: 2018-09-05 09:04 GMT

మనుషుల దెబ్బకు జంతువులకు చోటు లేకుండా పోయింది.వాటి ఇళ్లలో మనం ఇళ్లు కట్టుకోవడంతో,అప్పుడప్పుడు అవి దారి తప్పి మన ఇళ్లల్లోకి వచ్చి అడపాదడపా కొందరిని కరుస్తుంటాయి.ఒక సీనియర్ న్యాయవాది సైతం ఇలాంటి పాము కాటుకు గురయ్యాడు.కోర్టుహాలులో ఉన్న తన రూమ్ లో కూర్చోని ఆయన తన పని చేసుకుంటుండగా ఆయన ఛాంబర్‌లోకి వచ్చిన పాము కుడి చేతిపై కాటు వేసింది.

వెంటనే ఆయన్ను కోర్టు సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. ఆయనకు చికిత్స చేసిన వైద్యులు, కోలుకున్నారని తేల్చి నిన్న సాయంత్రం డిశ్చార్జ్ చేశారు.అదృష్టవశాత్తు ఆయన్ను  కరిచిన పాము విషపూరితం కాదని బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మీడియాకు తెలిపారు.కోర్టు పాత భవనంలో ఉండటం,దానికి తోడు చుట్టు పిచ్చి మొక్కలు ఉండటం వల్ల ఈ విషాదం జరిగిందని పాము కాటుకు గురైన లాయర్ కషీద్ చెప్పారు. 

 

Similar News