అక్రమాస్తుల కేసులో జడ్జి వరప్రసాద్ అరెస్ట్

Update: 2018-11-15 05:38 GMT

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రంగారెడ్డి జిల్లా 14వ అదనపు జిల్లా జడ్జి వరప్రసాద్ ఏసీబీకి చిక్కారు. వరప్రసాద్‌కు సంబంధించిన ఇళ్లల్లో సోదాలు నిర్వహించిన ఏసీబీ అధికారులు 3కోట్ల విలువైన అక్రమ ఆస్తులను గుర్తించారు. దీంతో హైకోర్టు ఆదేశాల మేరకు ఏసీబీ అధికారులు ఆయనపై కేసు నమోదు చేశారు. మేజిస్ట్రేట్ ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. 

హైదరాబాద్ కొండపూర్‌లో ఆయనకు 53లక్షల విలువ చేసే ఫ్లాట్, దిల్‌సుఖ్‌నగర్‌లో 5.68లక్షల విలువైన ప్లాట్, బ్యాంకు బ్యాలెన్స్ రూ.38.16లక్షలు, 14 లక్షల విలువైన హోండా సిటీ కారు, దిల్‌సుఖ్‌నగర్ ఇంట్లో 2.61 లక్షల విలువ చేసే హౌస్ హోల్డ్ ఆర్టికల్స్, కొండాపూర్ ఇంట్లో 9.80 లక్షల విలువ చేసే హౌస్ హోల్డ్ ఆర్టికల్స్, 30వేల విలువైన టీవీఎస్ స్కూటీ పెప్ట్‌తో కలిపి మొత్తం 3కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు ఏసీబీ అధికారులు. 

Similar News