బ్రేకింగ్: అంతర్జాతీయ క్రికెట్‌కి గుడ్‌బై చెప్పిన డివిలియర్స్

Update: 2018-05-23 12:10 GMT

సౌతాఫ్రికా కమ్ బెంగళూరు రాయల్ చాలెంజర్స్.....సూపర్ స్టార్ క్రికెటర్ ఏబీ డివిలియర్స్....అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 34 ఏళ్ల 95 రోజుల వయసులోనే ఆటకు గుడ్ బై చెప్పాడు. 14 సంవత్సరాల తన అంతర్జాతీయ క్రికెట్ కెరియర్ లో డివిలియర్స్ మొత్తం 114 టెస్టులు ఆడి 22 సెంచరీలతో సహా 8వేల 765 పరుగులు సాధించాడు. 228 వన్డేల్లో 9వేల 577 పరుగులు, 78 టీ-20ల్లో 1672 పరుగులు సాధించిన రికార్డులు ఏబీ డివిలియర్స్ కు ఉన్నాయి. ఐపీఎల్ లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ స్టార్ ప్లేయర్ గా ఉన్న డివిలియర్స్ ప్రస్తుత సీజన్లో ఐదు హాఫ్ సెంచరీలు సాధించినా తనజట్టుకు ప్లేఆఫ్ రౌండ్ బెర్త్ అందించలేకపోయాడు. క్రికెట్ చరిత్రలోనే ఓ అసాధారణ ఆటగాడిగా నిలిచిన డివిలియర్స్ తన ఆఖరిమ్యాచ్ ను రాజస్థాన్ రాయల్స్ తో ఆడి కెరియర్ ముగించినట్లయ్యింది.

Similar News