Jaya Prakash Narayana: మనదేశం లో వ్యవసాయం ప్రకృతి శాపం కాదు పాలకుల పాపం..

-జయ ప్రకాష్ నారాయణ లోకసత్తా వ్యవస్థాపకులు ..

-2011 లో దేశం మొత్తం లో 8 కోట్ల టన్నుల ధాన్యాలు ఉన్నాయి. ప్రస్తుతం కూడా అంతే నిల్వలు ఉన్నాయి..

-ప్రపంచం లో ఇతర దేశలో బియ్యం ధరలు భారీగా ఉన్నప్పుడు మన దగ్గర నిల్వలు ఎక్కువగా పెంచి ప్రభుత్వం ఎగుమతులు నిషేధించింది ఫలితంగా   ధరలు పూర్తిగా పడిపోయాయి...

-2012 లో మన రాష్ట్రంలో 750 పలికితే పక్క రాష్ట్రం లో 1200 పలుకుతుంది రైతులు పక్క రాష్ట్రాలకి అమ్మడానికి లేదు అని ఆంక్షలు విధించింది దాని ద్వారా   రైతులు తీవ్రంగా నష్టపోయారు...

-1.రైతులు పండించిన ధాన్యం ఎక్కడైనా అమ్ముకోవాలని

-వ్యవసాయ చట్టాల్లో మార్పులు అవసరం రైతులకు గుత్తాధిపత్యం ఉండాలి...

-పండించిన దాన్యం ఎక్కడ రేటు వస్థే అక్కడ అమ్ముకోవాలి...

-2.నిత్యావసర వస్తువుల చట్టం కొరత వచ్చినప్పుడు ధరలు పెరిగినప్పుడు ఉన్నపలంగా ఎగుమతులు నిషేదిస్తరు దీని ద్వారా రైతులు నష్టపోతారు..

-ఎవరు ఎంతైనా నిల్వ చేసుకోవచ్చు అన్నప్పుడు ధరలు పెరుగుతాయని అందరిలో భయం ఉంది

-నిల్వ ఉండడం వల్ల ధరలు పెరుగుతాయనడం ఆధారాలు లేని వాదన..ఇది ఆర్థిక శాఖ ములసుత్రాలకు పూర్తిగా విరుద్దం..

-3.కాంట్రాక్ట్ వ్యవసాయం..దీనిపై రైతులకు స్వేచ్చ ఉంటుంది ..

-దీని వల్ల కాంట్రాక్ట్ వాళ్ళు సహాయం చేస్తారు.రేటు వస్తేనే అమ్మావచ్చు లేదంటే వదులుకోవాలి...

-రైతులకు ఆంక్షలు లేకుండా స్వేచ్చ గా చేసుకున్న వ్యవసాయం ఈ బిల్లులు చెప్తుంది..

-ఈ చట్టాలు అద్భుతం కాదు ఇది రైతులకు అవసరం..

-ప్రభుత్వాలకు సూచనలు:

1. పంటలు నిల్వలు చేసుకోవడానికి సరైన గిడ్డంగి సదుపాయం ఉండాలి రెట్లు వచ్చినప్పుడు రైతులు అమ్ముకుంటారు..

2. రైతులకు కొనుగోలుదారులకు మధ్య దళారుల వ్యవస్థ ఉంది.దీని ద్వారా రైతులు నష్టపోతున్నారు..

3. అంతర్జాతీయ వాణిజ్యం లో పాలుపంచుకోవాలి..

Update: 2020-10-02 13:24 GMT

Linked news