కోవిడ్ 19 నేపధ్యంలో ప్రయాణికుల భద్రత కోసం రైల్వే... ... Live Updates:ఈరోజు (జూన్-08) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

కోవిడ్ 19 నేపధ్యంలో ప్రయాణికుల భద్రత కోసం రైల్వే స్టేషన్ లలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా సికింద్రాబాద్ ,హైదరాబాద్ రైల్వే స్టేషన్ లలో బులెట్ థర్మల్ ఇమేజ్ స్క్రీనింగ్ కెమెరా ల ఏర్పాటు.

బులెట్ థర్మల్ ఇమేజ్ స్క్రినింగ్ కెమెరా లో ,నెట్వర్క్ వీడియో రికార్డర్ ,ఎల్ఈడి మానిటర్ లు అలారం మేకనిజం లు ఉన్నాయి.

రైల్వే ప్రయాణికుల ప్రయోజనం కోసం లక్షణాలు చూడడం కోసం మాములు థర్మల్ స్క్రినింగ్ ద్వారా అధిక సమయం పడుతున్నందున బులెట్ థర్మల్ ఇమేజ్ స్క్రినింగ్ ద్వారా ఒకేసారి 30 మందిని పరీక్షించగలదు.

ఈ థర్మల్ స్క్రినింగ్ ద్వారా కెమెరా రికార్డ్ చేసిన ప్రయాణికుల శరీర ఉష్ణోగ్రతలు అక్కడే ఎల్ఈడి స్క్రీన్ పై ప్రదర్శించబడి అలారం ద్వారా హెచ్చరికలు జరిచేస్తుంది.

ఇవి సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్ లో ఫ్లాట్ ఫామ్ 1 వద్ద ఏర్పాటు చేయబడ్డాయి.

ఈ సందర్భంగా పరికరాలు ఏర్పాటు చేసిన సిబ్బంది ని దక్షిణమధ్య రైల్వే జీఎం గజనన్ మాల్యా అభినందించారు.

Update: 2020-06-08 11:55 GMT

Linked news