పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నిర్మాణం పై నిపుణుల... ... Live Updates: ఈరోజు (ఆగస్ట్-28) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నిర్మాణం పై నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదిక పైన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో అభ్యంతరాలు వ్యక్తం చేసిన తెలంగాణ ప్రభుత్వం

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నై బెంచ్ లో నేడు వాదనలు వినిపించిన తెలంగాణ ప్రభుత్వం

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నిర్మాణం విషయంలో లో అన్ని అంశాలను పరిశీలించకుండానే పర్యావరణ అనుమతులు అవసరం లేదని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది.

ఈ ప్రాజెక్టు నిర్మాణం ద్వారా రాయలసీమ ప్రాంతానికి ఇప్పుడున్న దానికంటే అధికంగా నీటిని తరలించే అవకాశం ఉంది.

ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేసి రాయలసీమలో 10 లక్షల ఎకరాలకు అదనంగా నీరు అందించేందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.

ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించకుండానే నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చి ఇవ్వడం తెలంగాణ ప్రభుత్వానికి అభ్యంతరకరం. కమిటీ ఇచ్చిన నివేదిక తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు పూర్తిగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది

కమిటీలో 4 సభ్యులు ఉంటే ఇద్దరు సభ్యులు ఈ నివేదికను తోసిపుచ్చారు , మరొక సభ్యుడు మౌనంగా ఉన్నప్పటికీ ఓకే సభ్యు డు ఇచ్చిన నివేదికను ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారని వాదించిన తెలంగాణ ప్రభుత్వం

పర్యావరణ శాఖ తరఫున కమిటీ తరఫున ఒకే వ్యక్తి ఇచ్చిన నివేదిక వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కృష్ణాట్రిబ్సునల్ లో నష్టం వాటిల్లుతుంది.

పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ విస్తరణ తో ముందుకు వెళుతుంది.

ఈ ప్రాజెక్టు నిర్మాణానికి NGT ఎటువంటి సంబంధం లేదు ఇది జలవివాదం అని ట్రిబ్యునల్లో వాదించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

తదుపరి విచారణను వచ్చే నెల మూడో (3) తారీఖు వాయిదా వేసిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్.

Update: 2020-08-28 10:30 GMT

Linked news