హైదరాబాద్: - ఎడతెరపి లేకుండా కురుస్తున్న... ... Live Updates:ఈరోజు (ఆగస్ట్-15) తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

హైదరాబాద్: 

- ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు మరికొన్ని రోజులు పడే అవకాశం ఉన్నందున శిధిలావస్థకు చేరిన భవనాలు,ప్రహరీ గోడలు, ఇతర నిర్మాణాల పట్ల అప్రమత్తంగా ఉండాలని నగర ప్రజలకు జి హెచ్ ఎం సి కమీషనర్ డి ఎస్ లోకేష్ కుమార్ సూచన

- వాతావరణ శాఖ నుండి వస్తున్న హెచ్చరికలు, కాల్ సెంటర్, వాట్సాప్ లు, కంట్రోల్ రూమ్ నుండి అందే ఫిర్యాదులకు తక్షణమే స్పందించుటకు అందుబాటులో ఉండాలని అధికారులు, మాన్సూన్ ఎమర్జెన్సీ, డి ఆర్ ఎఫ్ బృందాలకు ఆదేశాలు

- శిథిలావస్థకు చేరిన భవనాలను తనిఖీ చేసి, చాలా ప్రమాదకరంగా వున్న నిర్మాణాలలో నివసిస్తున్న ప్రజలను తక్షణమే ఖాళీ చేయించి, దానిని సీల్ చేయాలని టౌన్ ప్లానింగ్ అధికారులకు ఆదేశాలు

- ప్రమాదకరంగా వున్న సెల్లార్లను భవన నిర్మాణ, శిధిల వ్యర్ధాలతో నింపించాలి

- బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ఏటవాలు,కొండ ప్రాంతాలలో తాత్కాలిక నివాసాలు ఏర్పాటు చేసుకుని నివసిస్తున్న ప్రజలు, ప్రమాదకరంగా వున్న ప్రహరీలకు ఆనుకుని వేసుకున్న షెడ్లలో నివసిస్తున్న వారిని ఖాళీ చేయించుటకు చర్యలు చేపట్టాలని టౌన్ ప్లానింగ్ అధికారులను కమీషనర్ ఆదేశాలు

Update: 2020-08-15 12:34 GMT

Linked news