సెప్టెంబర్‌ 15 వరకు పద్మ అవార్డులకు నామినేషన్ల స్వీకరణ

న్యూ ఢిల్లీ: పద్మ అవార్డులు-2021 కోసం ఈ ఏడాది సెప్టెంబర్‌ 15వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తున్నట్లు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంహెచ్‌ఏ) గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ అవార్డులను 2021 గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తారు. వీటికోసం ఆన్‌లైన్‌ నామినేషన్లు ఈ ఏడాది మే ఒకటో తేదీనుంచి ప్రారంభమయ్యాయి. పద్మ అవార్డుల నామినేషన్లు లేదా సిఫార్సులను పద్మ అవార్డుల పోర్టల్ https://padmaawards.gov.in లో మాత్రమే తీసుకుంటామని ఎంహెచ్‌ఏ పేర్కొంది.

పద్మ పురస్కారాలు పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ. ఇవి దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలు. 1954నుంచి ప్రతి ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటిస్తున్నారు. అన్నిరంగాల్లో విశిష్టమైన సేవలందించిన వారికి వీటిని ప్రదానం చేస్తారు.

Update: 2020-07-02 16:47 GMT

Linked news