అక్రమ ఇసుక వేలం పాటలో రెవిన్యూశాఖకు రూ.14,200 ఆదాయం

బిచ్కుంద: మండలంలోని పుల్కల్ గ్రామ మంజీర నది నుండి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా తరలిస్తున్న నాలుగు ఇసుక ట్రాక్టర్ లను పట్టుకొని పోలీస్ స్టేషన్లో ఉంచిన విషయం అందరికి తెల్సిందే.

- ఈ పట్టుబడ్డ ఇసుకను సోమవారం రెవిన్యూ అధికారులు పోలీస్ స్టేషన్ ఆవరణలో వేలం పాట నిర్వహించగా రెవిన్యూకు 14వేల 2వంద రూపాయలు ఆదాయం చేకూరినట్లు తహాసీల్దార్ కార్యాలయ సీనియర్ సహాయకులు రచప్ప తెలిపారు.

- వేలంపాటలో పలువురు పాల్గొనగా ఒక్కో ట్రాక్టర్ ఇసుకకు 3600రూపాయలు చొప్పున మరో రెండు ట్రాక్టర్ లకు ఒక్కోక్కటికి 3,500 రూపాయల చొప్పున వేలం పాట పాడడంతో మొత్తం రెవిన్యూ శాఖకు 14,200రూపాయలు ఆదాయం చేకూరిందని అన్నారు.



Update: 2020-07-06 11:00 GMT

Linked news