నోయిడాలో భూప్రకంపనలు..భయాందోళనల్లో ప్రజలు

ఢిల్లీ సమీపంలోని నోయిడా ప్రాంతంలో బుధవారం అర్దరాత్రి భూప్రకంపనలు సంభవించాయి. నోయిడాలో దక్షిణ తూర్పున 19 కిలోమీటర్ల దూరంలో సంభవించిన ఈ భూకంపం రిక్టర్ స్కేలుపై 3.2 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. నోయిడాలో 3.8 కిలోమీటర్ల లోతులో భూమి కంపించిందని శాస్త్రవేత్తలు చెప్పారు. గత వారం రోజుల్లోనే ఢిల్లీతోపాటు హర్యానాలోని రోహతక్ కేంద్రాలుగా భూమి కంపించింది. మే 29న రోహతక్ ప్రాంతంలో భూకంపం వచ్చింది. ఏప్రిల్ 12,13 తేదీల్లో ఢిల్లీలోనూ స్వల్పంగా భూమి కంపించింది. ఢిల్లీతోపాటు చుట్టుపక్కల నగరాల్లో భూప్రకంపనలు సంభవిస్తుండటంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. 

Update: 2020-06-04 05:18 GMT

Linked news