నేడు రాష్ట్రపతిని కలవనున్న టీడీపీ ఎంపీలు.. వివరించనున్న రాష్ట్ర పరిస్తితి

ఏపీ ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ టీడీపీ ఎంపీలు నేడు రాష్ట్రపతిని కలవనున్నారు. ఇటీవల కాలంలో ఏపీలో చోటుచేసుకుంటున్న పరిస్థితులను ఆయనకు వివరించేందుకు వెళ్లనున్నట్టు తెలిసింది. తెలుగుదేశం పార్టీ ఎంపీలు గురువారం ఢిల్లీలో రాష్ట్రపతి రామనాథ్‌ కోవింద్‌ను కలవనున్నారు.

గత 13 నెలలుగా రాష్ట్రంలో నెలకొన్న దౌర్జన్యకర వాతావరణం, రాష్ట్రంలో చోటుచేసుకొంటున్న ఘటనల గురించి వారు రాష్ట్రపతికి వివరించనున్నారు. పౌరుల ప్రాథమిక హక్కులు కాలరాయడం, రాజ్యాంగ వ్యవస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తులు, సంస్థలపై దాడులు, పేదల భూములు లాక్కోవడం, ప్రతిపక్షాలకు చెందిన వారిపై హింస, దౌర్జన్యాలు, ఆస్తుల ధ్వంసం, దళితులపై దాడులు తదితర విషయాలను ఆయనకు వివరించనున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి.





Update: 2020-07-16 05:34 GMT

Linked news