వరవరరావు ఆరోగ్యాన్ని కాపాడండి . కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సీఎల్పీ నేత భట్టి వినతి.

బీమాకోరేగావ్‌ కేసులో 2018 ఆగస్టులో అరెస్టయిన ప్రముఖ రచయిత, విరసం నాయకులు, పౌర హక్కుల నేత వరవరరావు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది ఆయన ఆరోగ్యాన్ని కాపాడాలి.

ప్రస్తుతం ముంబయిలోని తలోజా జైలులో ఉన్న వరవరరావును మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించాలని, లేకపోతే ఆయన ప్రాణాలకు ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది.

తెలంగాణ పౌర సమాజం పక్షాన పౌర హక్కుల సాధన కోసం, పేద ప్రజల కోసం, రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు అయిన భావ ప్రకటన స్వాతంత్రం కోసం ఉద్యమిస్తున్న వరవరరావు జైల్లో ఏదైనా జరిగితే అది రాజ్యం చేసిన ద్రోహంగా అవుతుంది.

న్యాయస్థానాలు శిక్షించిన వారికి కూడా ఆరోగ్యం బాగలేకపోతే మెరుగైన వైద్యం అందిస్తారని ఉరి శిక్ష వేసిన వారికి కూడా ఆరోగ్యం బాగలేకపోతే ఉరి వాయిదా వేస్తారు.

అలాంటిది రోజుల తరబడి అనారోగ్యంతో ఉన్న తెలంగాణ ప్రాంత ఉద్యమ నేతను అక్కడి ప్రభుత్వాలు, పోలీస్ లు పట్టించిలుకోకపోవడం శోచనీయము.

ఈ విషయంలో రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వరవరరావు ఆరోగ్యాన్ని కాపాడాలి.

Update: 2020-07-12 14:05 GMT

Linked news