చెక్ డ్యామ్ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నోముల

అనుముల: మండలం పులిమామిడి గ్రామం వాగు వద్ద 5 కోట్లతో నిర్వహించ తలపెట్టిన చెక్ డ్యామ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఈ సందర్భంగా మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవడం కోసం వృధాగా పోతున్న వాగులు వంకలు పై చెక్ డ్యాంల నిర్మాణం కోసం ప్రత్యేక దృష్టి సారించిందని, దానిలో భాగంగా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి పది చెక్ డ్యాములు మంజూరు చేసిన కేసీఆర్ కి ధన్యవాదాలు తెలిపినారు.

నాగార్జునసాగర్ నియోజకవర్గ అభివృద్ధిలో వ్యవసాయం ప్రధానంగా ఉన్నది చెక్ డ్యామ్ ల వలన నీటిని నిల్వ చేసుకోవడంతో పాటు భూగర్భ జలాలు పెంపొందించుకోవడంలో ఉపయోగ పడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి, వైస్ చైర్మన్, ఇరిగి పెద్దలు, ఎంపీపీ సుమతి పురుషోత్తం, మాజీ ఆప్కాబ్, చైర్మన్ ఎడవెల్లి విజయేంద్ర రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.



Update: 2020-07-06 11:07 GMT

Linked news