Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 110 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
Stock Market: 40 పాయింట్ల లాభంతో 19,306 వద్ద ముగిసిన నిఫ్టీ
Stock Market: స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 110 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 110 పాయింట్లు పుంజుకొని 64 వేల 996 వద్ద ముగియగా.. నిఫ్టీ 40 పాయింట్లు లాభపడి 19 వేల 306 దగ్గర ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లలోని మిశ్రమ సంకేతాలు మార్కెట్లపై ప్రభావం చూపాయి. సెన్సెక్స్ 30 సూచీలో ఎల్‌అండ్‌టీ, ఎంఅండ్‌ఎం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, సన్‌ఫార్మా, మారుతీ, కోటక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, టాటా స్టీల్, ఎస్‌బీఐ షేర్లు లాభపడ్డాయి. రిలయన్స్, జియోఫిన్, నెస్లే ఇండియా, ఐటీసీ, టైటన్, హెచ్‌సీఎల్ టెక్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌యూఎల్, టాటా మోటార్స్ షేర్లు నష్టపోయిన వాటిలో ఉన్నాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ వార్షిక సాధారణ సమావేశ ప్రకటనలు మదుపర్లను ఆకట్టుకోలేకపోయాయి. కంపెనీ షేరు ఈరోజు 1.38 శాతం నష్టపోయి 2 వేల 435.95 దగ్గర స్థిరపడింది. మరోవైపు జియో ఫైనాన్షియల్ షేరు విలువ సైతం 0.97 శాతం కుంగి 210.20 దగ్గర ముగిసింది. రాజస్థాన్‌లో చమురు-గ్యాస్ క్షేత్రాల నుంచి 9 వేల 545 కోట్లు అదనంగా చెల్లించాలన్న ప్రభుత్వ డిమాండ్‌పై నడుస్తున్న మధ్యవర్తిత్వ కేసులో వేదాంతా గెలిచిన నేపథ్యంలో కంపెనీ షేరు విలువ 2.01 శాతం పుంజుకొని 238 దగ్గర స్థిరపడింది.