Stock Market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market: 92 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
Stock Market: నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు కూడా నష్టపోయాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ప్రతికూల పరిస్థితులు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 286 పాయింట్లు నష్టపోయి 65వేల226కి పడిపోయింది. నిఫ్టీ 92 పాయింట్లు కోల్పోయి 19వేల436 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ 30 సూచీలో నెస్లే ఇండియా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, ఇన్ఫోసిస్, టీసీఎస్, హెచ్‌సీఎల్ టెక్, భారతీ ఎయిర్‌టెల్, ఏషియన్ పెయింట్స్ షేర్లు లాభాల్లో ముగిశాయి. యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఎన్‌టీపీసీ, ఇండస్‌ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్స్, టాటా స్టీల్, బజాజ్ ఫిన్‌సర్వ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, మారుతీ, ఎల్‌అండ్‌టీ, సన్‌ఫార్మా, బజాజ్ ఫైనాన్స్ షేర్లు నష్టాల్లో స్థిరపడ్డాయి.