Pregnant Women Alert: గర్భిణులకు అలర్ట్‌.. ఈ కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌కి అప్లై చేశారా..!

Pregnant Women Alert: దేశంలోని మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక ప్రభుత్వ పథకాలను అమలు చేస్తోంది.

Update: 2023-10-02 12:30 GMT

Pregnant Women Alert: గర్భిణులకు అలర్ట్‌.. ఈ కేంద్ర ప్రభుత్వ స్కీమ్‌కి అప్లై చేశారా..!

Pregnant Women Alert: దేశంలోని మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం అనేక ప్రభుత్వ పథకాలను అమలు చేస్తోంది. కోట్లాది మంది ప్రజలు ఈ పథకాల ప్రయోజనాలను పొందుతున్నారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా గర్భిణులకు రూ.6000 ఆర్థిక సాయం అందజేస్తోంది. ఈ డబ్బు పీఎం మాతృత్వ వందన యోజన పథకం కింద ఇవ్వబడుతోంది. మీరు ఒక మహిళ అయితే ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ఇప్పటికే రూ. 3 కోట్ల మందికి పైగా మహిళలు ఈ స్కీం లబ్ధి పొందారు.

పథకం ప్రత్యేకత

>> గర్భిణీల వయస్సు 19 సంవత్సరాలు ఉండాలి.

>> ఈ పథకంలో ఆఫ్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

>> ప్రభుత్వం 3 విడతలుగా రూ.6000 బదిలీ చేస్తుంది.

>> ఈ పథకం 1 జనవరి 2017న ప్రారంభించారు.

>> ఈ పథకంలో వాయిదాల పద్ధతిలో డబ్బు అందుతుంది.

ఈ పథకంలో గర్భిణులకు మొదటి దశలో రూ.1000, రెండో దశలో రూ.2000, మూడో దశలో రూ.2000 ఇస్తారు. బిడ్డ పుట్టినప్పుడు ప్రభుత్వం ఆసుపత్రికి చివరి రూ.1000 ఇస్తుంది. మాతృ వందన యోజనను ప్రభుత్వం 1 జనవరి 2017న ప్రారంభించింది. ముఖ్యంగా గర్భిణులు, పాలిచ్చే తల్లుల కోసం ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పటి వరకు దేశంలోని 3 కోట్ల మందికి పైగా మహిళలు ఈ ప్రభుత్వ పథకంలో చేరారు. ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకున్నారు.

Tags:    

Similar News