Petrol Price today 25.10.19: రెండో రోజూ తగ్గిన పెట్రోల్ ధరలు

Update: 2019-10-25 03:53 GMT

రెండో రోజూ పెట్రోల్ ధరలు తగ్గాయి. హైదరాబాద్ లో లీటరు పెట్రోల్ 12 పైసలు తగ్గింది. దీంతో పెట్రోల్ ధర 77.69 రూపాయలకు చేరింది. ఇక డీజిల్ ధర కూడా 6 పైసల మేర తగ్గుదల నమోదు చేసింది దీంతో 71.97 రూపాయలైంది.

అటు అమరావతిలోనూ ఇదే పరిస్థితి వుంది. ఇక్కడా పెట్రోల్ ధర లీటరుకు 11 పైసలు తగ్గింది. దీంతో 77.31 రూపాయలు గా నిలిచింది. ఇక డీజిల్ ధర కూడా 6 పైసలు తగ్గడంతో 71.27 రూపాయల వద్దకు చేరింది. ఇక విజయవాడలో కూడా పెట్రోల్ ధర , డీజిల్ ధర ల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. దీంతో పెట్రోల్ ధర లీటరుకు 11 పైసలు తగ్గి 76.94 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరుకు 5 పైసలు తగ్గి 70.93 రూపాయలుగానూ నిలిచాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడా పెట్రోల్ ధర లీటరుకు 11 పైసలు తగ్గింది. దాంతో 73.06 రూపాయలుగా నిలిచింది. డీజిల్ ధర లీటరుకు 6 పైసలు తగ్గడంతో 66.00 రూపాయలుగా నమోదైంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పెట్రోల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక్కడ పెట్రోల్ ధర లీటరుకు 10 పైసలు, డీజిలు లీటరుకు 7 పైసలు తగ్గడంతో, పెట్రోల్ లీటరుకు 78.68 రూపాయలుగానూ, డీజిల్ ధర లీటరుకు 69.17 రూపాయలుగానూ ఉన్నాయి.

పెట్రోల్ డీజిల్ ధరలు ప్రతిరోజూ ఉదయం ఆరు గంటలకు మారుతుంటాయి. ఈ విధానం రెండేళ్లుగా అమలులోకి వచ్చింది. ప్రతి ఉదయం ముఖ్య నగరాల్లో ప్రకటించిన పెట్రోల్ ధరలు ఇక్కడ ఇవ్వడం జరుగుతోంది.

Tags:    

Similar News