Petrol Price Today: మళ్లీ తగ్గిన పెట్రోల్ ధరలు

Update: 2019-10-12 03:34 GMT

ఈరోజూ అంతర్జాతీయంగా పెట్రోల్ ధరలు పెరుగుదల నమోదు చేశాయి. అయినప్పటికీ   దేశీయంగా పెట్రోల్ ధరలు శనివారం కూడా తగ్గాయి. హైదరాబాద్ లో శనివారం పెట్రోల్ ధర లీటరుకు 10 పైసలు, డీజిల్ ధర లీటరుకు 15 పైసలు తగ్గింది. దీంతో లీటరు పెట్రోల్ ధర 77.97రూపాయలు, డీజిల్ ధర 72.47 రూపాయలుగానూ నిలిచింది. అమరావతిలోనూ పెట్రోల్ ధర, డీజిల్ ధరలు తగ్గాయి. శనివారం పెట్రోల్ ధర లీటరుకు 10 పైసలు, డీజిల్ ధర లీటరుకు 15 పైసలు తగ్గింది. దీంతో ఇక్కడ పెట్రోల్ ధర 77.58 రూపాయలవద్ద, డీజిల్ ధర 71.75 రూపాయలుగానూ ఉంది. అదేవిధంగా విజయవాడలో కూడా శుక్రవారం పెట్రోల్ ధర లీటరుకు 10 పైసలు, డీజిల్ ధర లీటరుకు 14 పైసలు తగ్గింది. పెట్రోల్ 77.21 రూపాయలు డీజిల్ 71.41 రూపాయలుగా ఉన్నాయి. 

దేశవ్యాప్తంగానూ పెట్రోల్ ధరలు గురువారం స్వల్పంగా తగ్గాయి.ముంబాయిలో పెట్రోల్ ధర లీటరుకు 10 పైసలు, డీజిల్ ధర లీటరుకు 15 పైసలు తగ్గింది. దీంతో ఇక్కడ పెట్రోల్ ధర 78.93 రూపాయలు, డీజిల్ ధర 69.66 రూపాయలుగానూ ఉంది. అదేవిధంగా దిల్లీలో కూడా పెట్రోల్ ధర లీటరుకు 10 పైసలు, డీజిల్ ధర లీటరుకు 14పైసలు తగ్గింది. పెట్రోల్ ధర 73.32 రూపాయలు, డీజిల్ 66.46 రూపాయలకు తగ్గింది.




Tags:    

Similar News