Petrol Price Today: 80 రూపాయలవైపు పరుగులు తీస్తున్న పెట్రోల్!

హైదరాబాద్ లో పెట్రోల్ ధరలు ఈరోజూ పెరిగాయి. దీంతో లీటరు పెట్రోలు 80 రూపాయల దిశగా పరుగులు తీస్తోంది. ఇక ముంబయిలో పెట్రోల్ ధర శుక్రవారమే 80 రూపాయలకు చేరింది.

Update: 2019-09-27 03:37 GMT

పది రోజుల్లో ఒక్క రోజు మాత్రమే పెట్రోల్ పరుగు ఆగింది. దీంతో పెట్రోల్ ధరలు లీటరుకు 80 రూపాయల వద్దకు వడి వడిగా చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు కూడా పైకే కదిలాయి.

ఇక గురువారం తో పోలిస్తే శుక్రవారం పెట్రోల్, డీజిల్ ధరల్లో పెరుగుదల చోటుచేసుకుంది. హైదరాబాద్ లో పెట్రోల్ ధర 15 పైసలు పెరిగి 79.02 రూపాయలుగా నిలిచింది. డీజిల్ ధర 10 పైసలు పెరిగి 73.29 రూపాయలైంది. ఇక అమరావతిలో నూ అదే పరిస్థితి ఉంది. ఇక్కడ పెట్రోల్ ధర 16 పైసలు పెరిగి 78.69 రూపాయలు గానూ, డీజిల్ ధర 10 పైసలు పెరిగి 72.62 రూపాయలుగానూ నమోదు చేసింది. విజయవాడలోనూ పెట్రోల్ ధర 16 పైసలు పెరిగి రూ.78.32, డీజిల్ ధర 11 పైసలు పెరిగి 72.28 రూపాయలకు చేరింది.

దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన పట్టణాల్లోనూ పెట్రోల్ ధరలు పెరిగాయి. ముంబాయిలో పెట్రోల్ ధర 15 పైసలు పెరిగి 80.00 రూపాయలు, డీజిల్ ధర 11 పైసలు పెరిగి 70.55 రూపాయలు గానూ, ఢిల్లీలో పెట్రోల్ ధర 15 పైసలు పెరిగి 74.34 రూపాయలుగానూ, డీజిల్ ధర 10 పైసలు పెరిగి 67.24 రూపాయలుగానూ ఉంది.


Tags:    

Similar News