ఏటీఎం వెళ్లకుండానే ఈ బ్యాంకు ద్వారా క్యాష్ డోర్ డెలివరీ...

పేటీఎం పే మెంట్ బ్యాంక్ వినియోగదారులకు శుభవార్త తెలిపింది.

Update: 2020-05-17 13:39 GMT
Paytm (File Photo)

పేటీఎం పే మెంట్ బ్యాంక్ వినియోగదారులకు శుభవార్త తెలిపింది. కరోనా నేపథ్యంలో బ్యాంకు కస్టమర్లు డబ్బులు డ్రా చేసుకోవడానికి బయటికి వెల్లకుండా ఖాతాదారుల ఇంటికే నగదును బట్వాడా చేసే సదుపాయాన్ని కల్పించింది. సీనియర్ సిటిజన్లు, దివ్యాంగుల ఈ సదుపాయాన్ని వినియోగించుకునేలా ఏర్పాట్లు చేసింది. దీని ద్వారా కరోనా వ్యాధి సోకకుండా జాగ్రత్తగా ఉండవచ్చు. ఈ కొత్త సేవ సహాయంతో, వారు తమ Paytm Payment Bank యాప్ లో విత్ డ్రాయల్ కోసం ఒక అభ్యర్థనను పంపవచ్చు. దానికి అనుగుణంగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ ద్వారా ఆ మొత్తాన్ని వారి ఇంటికి తెచ్చి ఇస్తారు. బ్యాంకులో సేవింగ్స్ ఖాతా నగదు ఉన్న సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు రిక్వెస్ట్ టాబ్ ద్వారా నగదు కోసం రిక్వెట్ చేసుకోవచ్చు. కనీస మొత్తం 1000 రూపాయలు నుంచి 5000 రూపాయల డెలివరీ ద్వారా తీసుకోవచ్చు.

అంతే కాదు ఈ పేటీఎం పేమెంట్ బ్యాంక్ ద్వారా కస్టమర్లు 1 లక్ష రూపాయల వరకు జమ చేయవచ్చు. వీరికి ఏడాదికి 4% చొప్పున వడ్డీని చెల్లిస్తుంది. ఈ పేమెంట్ ని కేవలం ఆన్ లైన్ లో మాత్రమే చేసుకునే అవకాశం ఉంది. దాంతో పాటుగానే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ సదుపాయాన్ని కూడా పేటీఎం ప్రవేశపెట్టింది. దీని ద్వారా 400 కి పైగా ప్రభుత్వ రాయితీలను నేరుగా వారి పిపిబిఎల్ పొదుపు ఖాతాకు బదిలీ చేయడానికి వినియోగదారులను అనుమతిస్తుంది.


Tags:    

Similar News