ఈ ప్రభుత్వ స్కీంలో ప్రతిరోజు రూ.7 ఆదా చేస్తే ఏటా రూ.60 వేల పెన్షన్..!

Atal Pension Yojana: అటల్ పెన్షన్ యోజన 2015 సంవత్సరంలో ప్రారంభించారు.

Update: 2022-11-25 15:00 GMT

ఈ ప్రభుత్వ స్కీంలో ప్రతిరోజు రూ.7 ఆదా చేస్తే ఏటా రూ.60 వేల పెన్షన్..!

Atal Pension Yojana: అటల్ పెన్షన్ యోజన 2015 సంవత్సరంలో ప్రారంభించారు. ఇంతకుముందు ఈ పథకం అసంఘటిత రంగాలలో పనిచేసే వ్యక్తుల కోసం మాత్రమే అని చెప్పారు. కానీ ఇప్పుడు 18 నుంచి 40 సంవత్సరాల వయస్సు గల భారతీయ పౌరులు ఎవరైనా ఈ పథకంలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో డిపాజిటర్లు 60 ఏళ్ల తర్వాత పెన్షన్ పొందడం ప్రారంభిస్తారు. ఈ పథకం కింద నెలవారీ కనిష్టంగా రూ. 1,000, రూ. 2000, రూ. 3000, రూ. 4000, గరిష్టంగా రూ. 5,000 పెన్షన్ పొందవచ్చు.

ఇది మీ పెట్టుబడి సురక్షితంగా ఉండే ప్రభుత్వ పథకం. మీరు ఈ పథకం ప్రయోజనాన్ని పొందాలనుకుంటే వెంటనే అప్లై చేసుకోండి. దీని కోసం మీకు సేవింగ్స్ ఖాతా, ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ ఉండాలి. ఈ అద్భుతమైన పథకంలో ఎంత త్వరగా పెట్టుబడి పెడితే అంత ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది. ఇందులో ఒక వ్యక్తి 18 సంవత్సరాల వయస్సులో అటల్ పెన్షన్ యోజనలో చేరినట్లయితే 60 సంవత్సరాల వయస్సు తర్వాత అతను ప్రతి నెలా రూ. 5000 నెలవారీ పెన్షన్ కోసం నెలకు కేవలం రూ. 210 డిపాజిట్ చేయాలి.

నెలకు రూ.5,000 పెన్షన్

ఈ పథకంలో ప్రతిరోజూ 7 రూపాయలు డిపాజిట్ చేస్తే నెలకు 5000 రూపాయల పెన్షన్ పొందవచ్చు. అదే సమయంలో ప్రతి నెలా 42 రూపాయలు డిపాజిట్ చేస్తే నెలవారీ పెన్షన్ 1000 రూపాయలు లభిస్తుంది. రూ.2000 పెన్షన్ కావాలంటే రూ.84 పెట్టుబడి పెట్టాలి. నెలవారీ రూ. 3000 పెన్షన్ కావాలంటే రూ.126 పెట్టుబడి పెట్టాలి. నెలవారీ రూ.4000 పెన్షన్ పొందాలనుకుంటే ప్రతి నెలా రూ.168 డిపాజిట్ చేయాలి.

పన్ను ప్రయోజనం

ఇందులో ఇన్వెస్ట్ చేసే వ్యక్తులు ఆదాయపు పన్ను చట్టం 80C కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను ప్రయోజనం పొందుతారు. ఇది కాకుండా కొన్ని సందర్భాల్లో రూ. 50,000 వరకు అదనపు పన్ను ప్రయోజనం లభిస్తుంది. ఈ పథకంలో రూ. 2 లక్షల వరకు మినహాయింపు లభిస్తుంది. ఈ పథకం కింద పెట్టుబడిదారుడు 60 ఏళ్లలోపు మరణిస్తే అతని భార్య/భర్త ఈ పథకంలో డబ్బును డిపాజిట్ చేయడం కొనసాగించవచ్చు. 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా పెన్షన్ పొందవచ్చు. ఆ వ్యక్తి భార్య తన భర్త మరణించిన తర్వాత ఏకమొత్తం క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. భార్య కూడా మరణిస్తే ఆమె నామినీకి ఏకమొత్తం అందుతుంది.

Tags:    

Similar News