దూసుకుపోతున్న బంగారం ధరలు..ఒక్కరోజే 1400 పెరిగిన వెండి!

Update: 2020-01-07 05:09 GMT

బగారం ధరలు జెట్ స్పీడులో దూసుకుపోతున్నాయి. యుద్ధమేఘాలు ఆవరించిన తరుణంలో బంగారం ధరలు అంతరిక్షం వైపు పరుగులు తీస్తున్నాయి. ఇక నిన్నటి వరకూ స్వల్పంగా పెరుగుదల నమోదు చేస్తున్న వెండి కూడా ఇప్పుడు బంగారంతో పోటీ పడుతోంది. ఇదేవరుస ఇంకొన్ని రోజులు కొనసాగవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే బంగారం ధర పది గ్రాములకు 42 వేల మార్కును దాటి వేసింది. ఇదే పరిస్థితి కొనసాగితే ఈ వారాంతానికి45 వేలు దాటిపోయే అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక వెండి ధర ఈరోజు ఏకంగా కేజీకి 1400 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. 

ఈరోజూ(07.01.2020) బంగారం పెరుగుదల దారిలో ఉంది. ఇక వెండి ధరలు కూడా ఈరోజు భారీ పరుగులు పెట్టాయి. హైదరాబాద్ మార్కెట్లో మంగళవారం ధరలు సోమవారం ధరలతో పోలిస్తే మరింత పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు ఏకంగా 740 రూపాయలు పెరిగి మళ్లీ షాక్ ఇచ్చింది. దీంతో 24 క్యారెట్ల బంగారం పది గ్రాములకు 42,510 రూపాయలకు ఎగబాకింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదేస్థాయిలో పెరిగింది. ఏకంగా 640 రూపాయలు పెరగడంతో 39,960 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక వెండి ధరలు కూడా ఒక్కసారిగా కేజీకి 1400 రూపాయలు పెరిగాయి. దీంతో కేజీ వెండిధర 51,000 రూపాయలకు చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలలో కూడా బంగారం ధరలు అదేవిధంగా ఉన్నాయి. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 42,510 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 39,960 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో బంగారం ధరలుమరింత పెరిగాయి. పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ఏకంగా 750 రూపాయలు పైకి ఎగసింది. దీంతో ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 41,000 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 650 రూపాయల పెరుగుదల నమోదు చేసి 39,800 రూపాయలకు చేరింది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 1400 రూపాయలు పెరిగింది. దాంతో వెండి ధర కేజీకి 51,000 రూపాయలుగా ఉంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 07.01.2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా..దేశీయంగా వాణిజ్య విపణిలో బంగారం..వెండి ధరలు ఎప్పటికప్పుడు మార్పులకు గురవుతుంటాయి. వాటి ఆధారంగా ధరల్లో స్థానికంగా హెచ్చుతగ్గులు ఉండవచ్చును.


Tags:    

Similar News