Gold Rates today 05-11-2019: దిగొచ్చిన బంగారం..షాకిచ్చిన వెండి!

నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధరలు కొద్దిపాటి తగ్గుదలను నమోదు చేస్తే.. వెండి మాత్రం భారీ స్థాయిలో పెరిగి 50 వేల చేరువలోకి వెళ్ళింది.

Update: 2019-11-05 01:40 GMT

నిన్నస్థిరంగా ఉన్న బంగారం ధరలు ఈరోజు స్వల్పంగా తగ్గాయి. 05.11.2019 మంగళవారం పది గ్రాముల బంగారం ధర సోమవారం ధరలతో పోలిస్తే, 40 రూపాయల వరకూ తగ్గింది.  కాగా, రెండురోజుల క్రితం భారీస్థాయిలో పతనమైన వెండి ధరలు తిరిగి అదేస్థాయిలో పైకెగాశాయి. వెండి ధరలు మంగళవారం ఒక్కసారిగా కేజీకి 9,750 రూపాయల వరకూ అమాంతం పెరిగిపోయాయి.

మంగళవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 40 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో పది గ్రాముల ధర 40,370 రూపాయలకు దిగింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధరకూడా 40 రూపాయలు తగ్గింది. దీంతో 37,010 రూపాయలైంది. ఇక వెండి ధరలు ఒక్కసారిగా భారీగా పైకెగాశాయి. దీంతో  హైదరాబాద్ లో కేజీ వెండి ధర 48,750 రూపాయలకు ఎగబాకింది. రెండు రోజుల క్రితం ఏ  స్థాయిలో కిందికి దిగొచ్చిందో అంతే స్థాయిలో వెండి ధరలు ఎగసిపడటం గమనార్హం. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు  40,370 రూపాయలు, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 37,010 రూపాయలుగా నమోదయ్యాయి.

కాగా, ఢిల్లీ మార్కెట్ లో ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 50 రూపాయలు తగ్గి 39,000 రూపాయల వద్ద నిలిచింది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 50 రూపాయలు తగ్గి  37,800 రూపాయల వద్దకు దిగింది. ఇక వెండి ధర ఇక్కడా భారీగా  పెరిగింది. దీంతో ఢిల్లీలో వెండి ధర కేజీకి 48,750 రూపాయలకు  చేరింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 05.11.2019 మంగళవారం ఉదయం  7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయ మార్కెట్లలో కదలాడే ధరలు.. దేశీయంగా ఉండే డిమాండ్ ఆధారంగా బంగారం ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి. బంగారం వెండి ధరలు స్థానిక మార్కెట్లలో కొద్దిగా అటూ ఇటూ గా మార్పులకు లోనయ్యే అవకాశం ఉంటుంది


Tags:    

Similar News