gold rates: అమ్మో బంగారం..40 వేలు దాటేసింది!

కొంతకాలంగా పెరుగుతూ వస్తున్నా బంగారం ధరలు ఈరోజు రికార్డు స్థాయిని అందుకున్నాయి. పది గ్రాముల బంగారం ధర దేశీయంగా 40,200 కి చేరింది. ఇక వెండి ధరలూ పెరుగుతూనే ఉన్నాయి.

Update: 2019-08-29 15:09 GMT

పసిడి పరుగులు ఆగలేదు. పది గ్రాములు 40 వేలు. ఇదీ ఈరోజు బంగారం ధర. కొన్నాళ్ళుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధర ఈరోజు రికార్డు సృష్టించింది.

దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు కొనుగోలుదార్లకు చుక్కలు చూపించాయి. ఈరోజు మార్కెట్లో ఏకంగా రూ. 40వేల మార్క్‌ను దాటి సరికొత్త జీవనకాల గరిష్ఠాన్ని తాకింది. గురువారం ఒక్కరోజే రూ. 250 పెరగడంతో బులియన్‌ మార్కెట్లో 10 గ్రాముల పుత్తడి రూ. 40,220 పలికింది. అటు వెండి ధర కూడా రూ. 50వేల మార్క్‌ను సమీపిస్తోంది. నేడు రూ. 200 పెరగడంతో కేజీ వెండి ధర రూ. 49,050కి చేరింది.

పండగ సీజన్ కావడం.. ఆర్ధిక మాంద్యం భయాలు, అమెరిక-చైనా మధ్య వానిజ్యసంబందాలలో అనిశ్చితి, రూపాయి పడిపోవడం ఇలా ఎన్నో కారణాలు పసిడి పరుగులకు కారణాలుగా నిలుస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. కొన్ని రోజుల పాటు ఇదే కొనసాగే అవకాశం లేకపోలేదని వారంటున్నారు.


Tags:    

Similar News