Gold Rate Today: కొనసాగుతున్న బంగారం భగభగలు.. ఆగని వెండి పరుగులు..

Update: 2020-02-25 01:51 GMT

బంగారం ధరలు దూసుకు పోతూనే ఉన్నాయి. కొన్ని రోజులుగా బంగారం ఏమాత్రం వెనుకడుగు వేయడం లేదు. ప్రతిరోజూ పెరుగుదల నమోదు చేస్తూ రికార్డు స్థాయిలో పెరుగుతూ పోతోంది. హైదరాబాద్ మార్కెట్లో మంగళవారమూ బంగారం పెరిగింది. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు భారీ పెరుగుదల నమోదుచేసింది. మరో 270 రూపాయలు పెరిగింది. దీంతో బంగారం ధర 10 గ్రాములకు 44,430 రూపాయల నుంచి 44,700 రూపాయల వద్దకు చేరింది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర కూడా అదేస్థాయిలో పైకెగసింది. 10 గ్రాములకు 270 రూపాయలు పెరిగింది. దీంతో 40,730 రూపాయల నుంచి 41,000 రూపాయలకు 22 క్యారెట్ల బంగారం ధర పెరిగింది..

దూసుకుపోయిన వెండి ధరలు..

బంగారం ధర భారీ పెరుగుదల నమోదు చేయగా..వెండి ధరలూ అదే స్థాయిలో పరుగులు తీశాయి. దీంతో మంగళవారం వెండి ధరలు అమాంతం పెరిగాయి. వెండి ధర కేజీకి నిన్నటి ధర 51,000 రూపాయల నుంచి 51,500 రూపాయలకు ఎగబాకింది.

విజయవాడ ..విశాఖపట్నంలలోనూ అదేవిధంగా.

ఇక విజయవాడ విశాఖపట్నం లోనూ బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి ఇక్కడ 24 క్యారెట్ ల బఁగారం 44,700 రూపాయలకు చేరుకొగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 41,000 రూపాయలు నమోదు చేశాయి. కాగా, వెండి ధరలు ఇక్కడా కేజీకి 500 రూపాయలు పెరిగాయి. దీంతో కెజీ వెండీ 51,500 రూపాయల వద్దకు చేరింది.

దేశ రాజధాని ఢిల్లీలో..

ఇక, దేశ రాజధాని ఢిల్లీలో బంగారం ధర లు భగ్గుమంటున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 260 రూపాయలు ఎగసి 43,050 రూపాయల వద్దకు చేరుకుంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 240 రూపాయలు పెరిగి 41,850 రూపాయల వద్దకు చేరింది. ఇక కేజీ వెండి ధర ఇక్కడ కూడా పెరిగింది.. దీంతో కేజీ వెండి 51,500 రూపాయలకు చేరుకుంది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 25-02-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News