Gold Rate: స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు. అదే దారిలో వెండి ధరలు!

Update: 2020-04-01 01:31 GMT

వారం ప్రారంభం నుంచీ తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు స్వల్పమైన మార్పులకు లోనయ్యాయి. గత రెండు రోజుల్లోనూ పది గ్రాములకు 2 వేలకు పైగా తగ్గిన బంగారం ధరలు ఈరోజు అతి స్వల్పంగా 10 రూపాయల్ తగ్గుదల నమోదు చేశాయి. మరోవైపు వెండి ధరలు కూడా కేజీకి 20 రూపాయల అత్యల్ప తగ్గుదల కనబరిచాయి.

బంగారం ధరలు మళ్ళీ తగ్గుదల నమోదు చేశాయి. బుధవారం (01.04.2020) బంగారం 22 క్యారెట్లు పది గ్రాములకు మంగళవారం నాటి ధర కంటే 10 రూపాయల తగ్గుదల నమోదు చేసి 39,510 రూపాయలుగా నిలిచింది. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా ధర కూడా పది గ్రాములకు 15 రూపాయల తగ్గుదలతో 43,160 రూపాయలు నమోదు చేసింది.

భారీగా తగ్గిన వెండి ధరలు...

బంగారం ధరలు దారిలోనే వెండి ధరలు కూడా అత్యంత స్వల్ప తగ్గుదల నమోదు చేశాయి.  వెండి ధర కేజీకి 20 రూపాయల తగ్గుదల నమోదు చేసింది. దీంతో 40 వేల మార్కు కంటే దిగువనేకేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 39,480 రూపాయల వద్దనిలిచింది.

విజయవాడ, విశాఖపట్నం లలో..

ఇక విజయవాడ, విశాఖపట్నం లలో కూడా బంగారం ధరలు ఇదే విధంగా ఉన్నాయి. ఇక్కడ కూడా 22 క్యారెట్లు పది గ్రాములకు నిన్నటి ధర కంటే 10 రూపాయల తగ్గుదల నమోదు చేసి 39,510 రూపాయలుగా నిలిచాయి. ఇక 24 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు 15 రూపాయల తగ్గుదలతో 43,160 రూపాయలు నమోదు చేసింది. ఇక వెండి ధరలు  కూడా ఇక్కడ కూడా  స్వల్పంగా తగ్గాయి.  వెండి ధర 39,480 రూపాయల వద్దకు చేరుకుంది.

దేశరాజధాని ఢిల్లీలో..

ఢిల్లీలో కూడా బంగారం ధరలు స్వల్పంగా  తగ్గాయి. దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 410 రూపాయల తగ్గుదలతో 43,290 రూపాయల వద్ద నిలిచింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 10 రూపాయల తగ్గుదలతో 41,010 రూపాయలకు చేరుకుంది. ఇక వెండి ధరలు ఇక్కడ కూడా స్వల్పంగా తగ్గాయి. 40 వేల మార్కు కంటే దిగువకు కేజీ వెండి ధర చేరింది. కేజీ వెండి ధర 39,480 రూపాయల వద్దనిలిచింది.

ఇక్కడ పేర్కొన్న బంగారం ధరలు 01-04-2020 ఉదయం 7 గంటల సమయానికి ఉన్న ధరలు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో చోటు చేసుకునే మార్పులు.. దేశీయంగా బంగారానికి డిమాండ్.. స్థానిక పరిస్థితులు ఆధారంగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు ఉండవచ్చును. ఈ ధరలో ఎప్పటికప్పుడు మార్పులు అవుతుంటాయి వీటిని గమనించి బంగారాన్ని కొనుగోలు చేసుకోవాల్సి ఉంటుంది.


Tags:    

Similar News