Gold Rates Today: బంగారం భారీ షాక్..40 వేల పైకి బంగారం! భారీగా తగ్గిన వెండి!!

Update: 2019-10-16 02:18 GMT

బంగారం ధరలు షాకిచ్చాయి. రెండు రోజులుగా కొద్దిమేర తగ్గుతూ వచ్చిన బంగారం ఒక్కసారిగా పది గ్రాములకు  350 రూపాయలు పెరిగింది. దీంతో పది గ్రాముల బంగారం 40 వేల రూపాయల మార్కును మళ్ళీ దాటేసింది.  అంతర్జాతీయంగా భారీగా పెరిగిన బంగారం ధరల ప్రభావం దేశీయ మార్కెట్ మీద కూడా పడింది. ఇక వెండి ధరలు భారీగా తగ్గాయి. కేజీ వెండి  1,150 రూపాయల వరకూ తగ్గింది. 

బుధవారం దేశీయంగా బంగారం ధరలు భారీ పెరుగుదల నమోదు చేశాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు 350  రూపాయలు పెరిగి 40,050 రూపాయలకు చేరుకుంది.  అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు  320 రూపాయలు పెరిగింది. దీంతో  36,720  రూపాయలకు చేరింది. ఇక వెండి ధర కేజీకి 1150 రూపాయలు తగ్గింది. హైదరాబాద్ లో కేజీ వెండి ధర 47,500 రూపాయలకు దిగింది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 40,050 , 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 36,720 రూపాయలుగానూ ఉన్నాయి. ఢిల్లీ మార్కెట్ లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 300 రూపాయలు పెరిగి  38,700 రూపాయలకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల ధర కూడా 300 రూపాయలు పెరిగి 37,500 రూపాయలకు చేరింది. ఇక కేజీ వెండి ధర 1150 రూపాయలు తగ్గి, 47,500 రూపాయలవద్దకు చేరుకుంది.



Tags:    

Similar News