December 1st: డిసెంబర్‌ 1 నుంచి ఈ విషయాలలో పెద్ద మార్పులు.. అవేంటంటే..?

December 1st: మరో రెండు రోజుల్లో డిసెంబర్ నెల ప్రారంభం కానుంది.

Update: 2022-11-29 07:43 GMT

December 1st: డిసెంబర్‌ 1 నుంచి ఈ విషయాలలో పెద్ద మార్పులు.. అవేంటంటే..?

December 1st: మరో రెండు రోజుల్లో డిసెంబర్ నెల ప్రారంభం కానుంది. ఈ నెలలో చాలా మార్పులు జరగనున్నాయి. ఇది నేరుగా మీ జేబుపై ప్రభావం చూపుతుంది. గ్యాస్ సిలిండర్ల ధరల నుంచి మొదలుకొని రైలు టైమ్ టేబుల్ వరకు చాలా మార్పులు జరగనున్నాయి. వాటి గురించి తెలుసుకుందాం.

జీవిత ధృవీకరణ పత్రం

పెన్షనర్లు తమ జీవిత ధృవీకరణ పత్రాన్ని సమర్పించడానికి చివరి తేదీ 30 నవంబర్ 2022. కాబట్టి సర్టిఫికెట్‌ను వెంటనే సమర్పించండి. ఒకవేళ సర్టిఫికేట్‌ సమర్పించకపోతే పెన్షన్ నిలిపివేసే అవకాశాలు ఉన్నాయి.

రైళ్ల టైమింగ్‌లో మార్పు

డిసెంబర్ నెలలో చలి, పొగమంచు కారణంగా చాలా రైళ్ల సమయాల్లో మార్పు ఉంటుంది. ఇది కాకుండా డజన్ల కొద్దీ రైళ్లు రద్దు అవుతాయి. ఈ పరిస్థితిలో ఒక ప్రణాళిక పరంగా ప్రయాణిస్తే మంచిది.

గ్యాస్ సిలిండర్ల ధరలలో మార్పు

CNG, PNG ధరలలో పెద్ద మార్పు ఉంటుంది. ప్రతి నెల మొదటి తేదీన చమురు కంపెనీలు ధరలను సమీక్షిస్తాయి. దీని పెరుగుదల మీ జేబుపై ప్రభావం చూపుతుంది. దీంతో పాటు గ్యాస్ సిలిండర్ల కొత్త ధరలను విడుదల చేస్తారు. గత నెలలో కంపెనీలు వాణిజ్య గ్యాస్ సిలిండర్ల ధరలను తగ్గించాయి.

బ్యాంకులకు 13 రోజుల సెలవు

డిసెంబర్ నెలలో 13 రోజులు బ్యాంకులకి సెలవులు రానున్నాయి. ఇందులో క్రిస్మస్‌తో సహా చాలా పండుగలు ఉన్నాయి. సంవత్సరంలో చివరి రోజు బ్యాంకులు మూసివేస్తారు. కాబట్టి బ్యాంకుకు వెళ్లే ముందు ప్లాన్ చేసుకుంటే మంచిది.

Tags:    

Similar News